ఆంధ్ర-తమిళనాడు సరిహద్దులోని వెల్లూరు రైతులు మామిడి పండ్లకు తగిన ధరలు లభించకపోవడంతో రోడ్లపై పండ్లను పారబోశారు. టన్నుకు రూ.15,000 మద్దతు ధర రైతులు కోరుతున్నారు. అయితే కిలోకు రూ. 15 కూడా లభించడం లేదని రైతులు వాపోతున్నారు. ఇప్పటికే మార్కెట్లో తక్కువ ధరలతో పాటు, వ్యాపారులు కూడా కొనుగోలుకు అడ్డంకులు సృష్టిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.