మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఇద్దరు అంతర్రాష్ట్ర చైన్ స్నాచర్లు స్థానిక రైతులకు పట్టుబడ్డారు. మహిళ మెడలోని బంగారు చైన్‌ను లాక్కొని పారిపోతుండగా వారిని రైతులు వెంటాడి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితులు ఉత్తర ప్రదేశ్‌కు చెందిన వికాస్ కుమార్, శుభం కుమార్ గా గుర్తించబడ్డారు. పోలీసులు రైతులను అభినందించారు.