నంద్యాల జిల్లా గడివేములకు చెందిన దూదేకుల సిద్ధయ్య అనే రైతు తన గుర్రాన్ని ఉపయోగించి పత్తి పంటను సాగు చేస్తున్నారు. ఎడ్లకు బదులు గుర్రంను ఉపయోగించడం చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోతున్నారు. ఆర్థిక కారణాల వల్ల ఎడ్లను కొనుగోలు చేయలేక గుర్రంను పనికి పెట్టుకున్నట్లు సిద్ధయ్య తెలిపారు.