మహేష్ బాబు ఖలేజా సినిమా రీ-రిలీజ్ సందర్భంగా విజయవాడలోని ఒక థియేటర్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఒక అభిమాని చేతిలో పామును పట్టుకుని థియేటర్లోకి ప్రవేశించి, సినిమాలోని ఒక సన్నివేశాన్ని అనుకరించే ప్రయత్నం చేశాడు. ప్రేక్షకులు మొదట పాము బొమ్మ అనుకున్నారు కానీ, పాము నిజమైనదని తెలిసి భయపడ్డారు.