మహబూబ్ నగర్ పట్టణం కమలా నగర్ లో దొంగలు రెండు ఇళ్లల్లో దొంగతనానికి యత్నించారు. ఇంట్లో ఉన్నవారిని బయటకు రప్పించేందుకు పన్నాగం పన్నినా, నివాసితుల అప్రమత్తతతో విఫలమైంది. చుట్టుపక్కల వారికి ఫోన్లు చేయడంతో దొంగలు పరారయ్యారు. కాలనీలో పెట్రోలింగ్ పెంచాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.