మెదక్ జిల్లా వెల్దుర్తిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలో చోరీకి యత్నం జరిగింది. దొంగలు గోడకు రంధ్రం చేసి లోపలికి చొచ్చుకుపోయారు. అయితే, అలారం మోగడంతో వారు పారిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.