తిరుపతి సమీపంలోని నాగులాపురం యూనియన్ బ్యాంక్‌లో అర్ధరాత్రి దొంగలు కన్నం వేసి చోరీకి ప్రయత్నించారు. సిమెంట్ గోడౌన్ గుండా బ్యాంకులోకి ప్రవేశించిన దొంగలు, సైరన్ తీగలు కట్ చేసి సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. లాకర్లు పగలగొట్టడానికి రాత్రంతా ప్రయత్నించినా విఫలమై, చివరకు తెల్లవారుజామున సీసీటీవీ డీవీఆర్, హార్డ్ డిస్క్‌లతో పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.