అధిక స్క్రీన్ టైమ్ మెదడులోని డోపమైన్ స్థాయిలను ప్రభావితం చేసి, నిద్రలేమి, ఏకాగ్రత లోపం, మానసిక ఆందోళనలకు దారితీస్తుంది. చిన్న పిల్లల మెదడు అభివృద్ధిపై కూడా దీని ప్రభావం ఎక్కువ. రోజుకు కొంత సమయం స్క్రీన్లకు దూరంగా ఉండటం, నిద్రకు ముందు స్క్రీన్ వాడకాన్ని తగ్గించటం, 20-20-20 నియమాన్ని పాటించటం వంటివి మంచిది.