సైక్లింగ్ చేయడం వల్ల కాళ్ళు, పిక్కలు, తొడలు బలపడతాయి. దీనివల్ల మొత్తం లోయర్ బాడీ బలంగా మారుతుంది. గుండె ఆరోగ్యానికి, రక్త ప్రసరణకు సైక్లింగ్ చాలా మేలు చేస్తుంది. రోజూ 15 నిమిషాలు సైక్లింగ్ చేస్తే హృదయ సంబంధిత వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. బ్యాలెన్స్ మెరుగుపడుతుంది. ఎక్కువ సేపు కూర్చొని పనిచేసే వారికి ఇది చాలా ఉపయోగకరం.