నారాయణపేట జిల్లాలోని ఏక్లాస్పూర్ గ్రామం వినాయకచవితి వేడుకలకు ఆదర్శంగా నిలుస్తోంది. 50 సంవత్సరాలుగా ఊరందరికీ కలిపి ఒకే వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి, పూజలు నిర్వహించే సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. ఈ ఐకమత్య స్ఫూర్తిని అందరూ అభినందిస్తున్నారు, తద్వారా సామాజిక విభేదాలకు తావులేకుండా పండుగను జరుపుకుంటున్నారు.