వర్షాకాలంలో వైరస్ల వల్ల గొంతు నొప్పి, గరగర సమస్యలు సర్వసాధారణం. ఈ సమస్యలకు మందులకు బదులుగా, ఇంటిలో దొరికే పదార్థాలతోనే ఉపశమనం పొందవచ్చు. ఉప్పునీరుతో పుక్కిలించడం, తేనె, అల్లం టీ, హెర్బల్ టీలు, పసుపు పాలు తీసుకోవడం వంటివి గొంతు నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి.