రోజుకొక యాపిల్ తింటే వైద్యులతో అవసరం ఉండదనేది పెద్దల మాట. పోషకాలు పుష్కలంగా ఉండే యాపిల్, ముఖ్యంగా ఖాళీ కడుపుతో తింటే అద్భుత ప్రయోజనాలు అందిస్తుంది. ఫైబర్ మలబద్ధకాన్ని నివారించి, రక్తపోటును నియంత్రిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఉత్తమ ఎంపిక. నెల రోజుల పాటు క్రమం తప్పకుండా తీసుకుంటే అనేక ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి.