ఖర్జూరాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని పౌష్టికాహార నిపుణులు చెబుతున్నారు. వీటిని రాత్రి నీటిలో నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తినడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. పాలు లేదా తేనెతో కలిపి తింటే శక్తి పెరుగుతుంది. కానీ, వీటిని అధికంగా తినకూడదు. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు తగినంత మోతాదులో తినాలి.