పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లోని కనుకుల గ్రామానికి చెందిన తాళ్ళపల్లి కొమురయ్య అనే వ్యక్తి కారు ప్రమాదంలో మరణించాడు. ఆయన పెంపుడు కుక్క రాజు తన యజమాని సమాధి వద్దకు ప్రతిరోజూ వెళ్లి, అతని రాక కోసం ఎదురుచూస్తూ ఉంది. కొమురయ్య కుటుంబ సభ్యులు ఆ కుక్కకు ఆహారం పెట్టినా, అది తినకుండా యజమాని కోసం విలపిస్తూ ఉండటం చూసినవారిని కంటతడి పెట్టిస్తోంది.