చాలా మంది టాబ్లెట్లు వేసుకున్న తర్వాత టీ, కాఫీ, పాలు తాగుతుంటారు. అయితే పాలలోని కాల్షియం, ప్రొటీన్లు, టీలోని కెఫిన్, టానిన్లు మందుల స్వీకరణను అడ్డుకుంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. యాంటీబయోటిక్స్, ఐరన్ సప్లిమెంట్స్, థైరాయిడ్, ఆస్టియోపోరోసిస్ మందులపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. అన్ని మందులను కేవలం నీటితో మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.