2017లో అమెరికాలో జరిగిన ఆంధ్రప్రదేశ్ మహిళ శశికళ నర్రా, ఆమె కుమారుడు అనీష్ నర్రా హత్య కేసును పోలీసులు ఛేదించారు. పొరుగున ఉండే సహోద్యోగి హమీద్ ఈ హత్యలు చేసినట్లు నిర్ధారించారు. అతని ల్యాప్‌టాప్‌పై లభించిన డీఎన్ఏ ఆధారాలు నిందితుడిని గుర్తించడంలో కీలక పాత్ర పోషించాయి. నర్రా కుటుంబంతో విభేదాలే హత్యకు కారణమని తేలింది.