ఈ సంవత్సరం దీపావళి అక్టోబర్ 20నా లేదా 21నా అనే సందేహానికి సమాధానం. సాధారణ అమావాస్య లెక్కలకు భిన్నంగా, దీపావళికి ప్రదోష కాలంలో తిథిని పరిగణలోకి తీసుకోవాలి. ఈ నియమం ప్రకారం, అక్టోబర్ 20వ తేదీనే దీపావళి జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. లక్ష్మీ పూజకు రాత్రి 7:08 నుండి 8:18 వరకు శుభ సమయం.