నటుడు సత్యరాజ్ కుమార్తె, పోషకాహార నిపుణురాలు దివ్య సత్యరాజ్ పెళ్లి వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఇద్దరు వ్యక్తులు ఇష్టపడితే కలిసి జీవించడానికి వివాహం అవసరం లేదని, పెళ్లి చేసుకోకుండానే తల్లి కావడానికి సిద్ధమని ఆమె ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.