బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు బిగ్ బాస్ తెలుగు కొత్త సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. ఈసారి ఎన్నో కొత్త హంగులతో రానున్న షో కంటెస్టెంట్ల ఎంపికపై ఆసక్తి రేపుతోంది. నటుడు ప్రభాకర్ కూతురు దివిజ ప్రభాకర్ బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెడుతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వార్తలపై అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాలి.