నైరుతి బంగాళాఖాతంలో దిత్య తుఫాను వాయుగుండం బలపడి చెన్నై నుంచి పుదుచ్చేరి వైపు దిశ మార్చుకుంది. బుధవారం ఇది తీవ్ర అల్పపీడనంగా బలహీనపడనుంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలతో పాటు గంటకు 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.