కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలం, జొన్నగిరి ప్రాంతంలో వజ్రాల వేట జోరందుకుంది. తాజాగా ఒక వ్యక్తికి వజ్రం దొరికిందన్న ప్రచారంతో వజ్రాలపై గ్రామస్థుల ఆశలు మరింత పెరిగాయి. వర్షాకాలంలో వజ్రాలు లభించే అవకాశం ఉండటంతో చాలామంది ఈ ప్రాంతానికి చేరుకుంటున్నారు. ఒక్క వజ్రం దొరికినా లక్షాధికారి కావచ్చనే ఆశతో వారు వజ్రాల కోసం గాలిస్తున్నారు.