ఏపీ లిక్కర్ స్కాం కేసులో ధనుంజయ్ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డిలను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. మూడు రోజుల విచారణ తర్వాత గురువారం సాయంత్రం వీరిని అరెస్ట్ చేశారు. వీరిద్దరూ ఈ కేసులో ఏ31, ఏ32 నిందితులుగా ఉన్నారు. సుప్రీంకోర్టు మే 16 వరకు తదుపరి చర్యలు నిలిపివేయాలని ఆదేశించినప్పటికీ, విచారణకు హాజరుకావాలని సూచించింది.