తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం బత్తినియ్య కోనలో భక్తవత్సల స్వామి దర్శనానికి వెళ్లిన 22 మంది భక్తులు భారీ వర్షం కారణంగా అడవిలో దారి తప్పారు. బయటకు వచ్చే మార్గం తెలియక సాయం కోసం ఆర్తనాదాలు చేశారు. అధికారులను ఫోన్లో వేడుకోగా, వారు స్పందించి భక్తులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.