హైదరాబాద్కు చెందిన మాజీ ఐఆర్ఎస్ అధికారి వై.వి.ఎస్.ఎస్. భాస్కర్ రావు తన మరణానంతరం తన కోట్ల విలువైన ఆస్తిని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కు విరాళంగా ఇచ్చారు. మూడు కోట్ల విలువైన ఇల్లు, 66 లక్షల రూపాయలను వివిధ ట్రస్టులకు విరాళంగా అందించాలని ఆయన తన వీలునామాలో పేర్కొన్నారు. ట్రస్టీలు ఈ వీలునామాను టీటీడీకి అందజేశారు.