తెలంగాణ అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తీవ్రంగా స్పందించారు. సభాపతి తల్లిని ఉద్దేశించి మాట్లాడిన మాటలను ఆయన ఖండించారు. ఇది కేవలం దళిత వర్గాల అంశం కాదని, యావత్ తెలంగాణ సమాజ సంస్కారానికి సంబంధించిన సమస్య అని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సభ్యులు సభా మర్యాదలను పాటించాలని హితవు పలికారు.