తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. తెలంగాణలోని ఆదిలాబాద్, సంగారెడ్డి, అసిఫాబాద్, వికారాబాద్, ఇబ్రహీంపట్నంలో ఉష్ణోగ్రతలు పది డిగ్రీల లోపే నమోదవుతున్నాయి. అటు ఆంధ్రప్రదేశ్లో దట్టమైన పొగమంచు ఆవరించింది. అల్లూరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. వారాంతం కావడంతో రద్దీ పెరిగింది.