గుడ్లు పోషకాల గని. విటమిన్లు, ప్రోటీన్లతో సమృద్ధిగా ఉంటాయి. కండరాల నిర్మాణానికి, రోగనిరోధక శక్తి పెంపునకు ఇవి చాలా అవసరం. కొందరు గుడ్లు తింటే బరువు పెరుగుతారని, కొలెస్ట్రాల్ పెరుగుతుందని భావిస్తారు. అయితే పోషకాహార నిపుణుల ప్రకారం, గుడ్లు తినడం వల్ల బరువు పెరగరు. పైగా, వాటిలోని ప్రోటీన్ కడుపు నిండుగా ఉంచి బరువు తగ్గడానికి సహాయపడుతుంది.