తమిళనాడులోని చెన్నైలోని అవడిలో కదులుతున్న రైలులో కొంతమంది యువకులు ప్రాణాలకు ముప్పు కలిగించే విన్యాసాలు చేస్తున్న వీడియో వెలుగులోకి వచ్చింది. యువకులు"గ్లైడింగ్" అనే స్టంట్ చేస్తున్న దృశ్యాలు ఈ వీడయోలో ఉన్నాయి. ఈ స్టంట్‌లో భాగంగా రైలు కదలడం ప్రారంభించినప్పుడు ఒక కాలు రైలుపై ఉంచి, మరొక కాలు ప్లాట్‌ఫారమ్‌పైకి లాగుతారు.