దానిమ్మ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉన్న దానిమ్మ.. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.