బరువు తగ్గడానికి నిమ్మరసం సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ ఉదయం నిమ్మరసం, తేనె, గోరువెచ్చు నీటిని కలిపి తీసుకోవడం వల్ల బరువు తగ్గడానికి దోహదం చేస్తుందని తెలిపారు. ఆరోగ్యకరమైన ఆహారం మరియు జీవనశైలితో కలిపి ఈ పద్ధతిని అనుసరించడం మంచిదని సూచించారు.