ఉదయం పరగడుపున అల్లం రసం తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేదం చెబుతోంది. అల్లం పురాతన కాలం నుండి వంటింటిలో ఉపయోగించబడుతోంది. దీనిలోని ఔషధ గుణాల కారణంగా అనేక ఔషధాల తయారీలోనూ దీన్ని ఉపయోగిస్తారు. రోజూ ఒక టీ స్పూన్ అల్లం రసం తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.