అరేబియా సముద్రంలో తొలి తుఫాన్‌గా ‘శక్తి’ దూసుకొస్తోంది. భారత వాతావరణ శాఖ దీనిపై హెచ్చరికలు జారీ చేసింది. హిందూ మహాసముద్రం తీరంలోని 13 దేశాలు తుఫాన్లకు పేర్లు నిర్ణయిస్తాయి. ప్రజలను అప్రమత్తం చేయడంలో సహాయపడే ఈ శక్తి పేరును శ్రీలంక సూచించింది.