నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుఫానుగా బలపడిందని ఐఎండీ ప్రకటించింది. ఇది ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ ఆదివారం తెల్లవారుజామున తమిళనాడు, పుదుచ్చేరి దక్షిణ కోస్తా తీరాలకు చేరనుంది. దీని ప్రభావంతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.