జీలకర్ర ప్రతి ఇంటి వంటగదిలో సర్వసాధారణమైన పదార్థం. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆహార నిపుణులు చెబుతున్నారు. ఖాళీ కడుపుతో జీలకర్ర నీరు తాగడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది, శ్వాసకోశ వ్యవస్థకు మేలు చేస్తుంది మరియు వివిధ వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తుంది.