గుంటూరు జిల్లా రెడ్డిపాలెం లోని శివాలయం వద్ద సెప్టెంబర్ 7న సంపూర్ణ చంద్రగ్రహణం సమయంలో అగోరా శ్రీనివాసరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిప్పులతో కూడిన పూజలు, మాంసాన్ని నివేదించడంతో స్థానికులు క్షుద్ర పూజలపై అనుమానం వ్యక్తం చేశారు. శ్రీనివాసరావు మాత్రం ఇది మృత్యుంజయ హోమమని వివరించారు. స్థానికులు ఆయనను వెంటనే ఆ ప్రాంతం ఖాళీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.