కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి అనూహ్యమైన అనుభవం ఎదురయ్యింది. నెలకు రూ.2 వేల పెన్షన్ చాలడం లేదని రూ.4 వేల పెన్షన్ ఎప్పుడు చూస్తారంటూ ఓ వృద్ధురాలు ఎమ్మెల్యేని ప్రశ్నించారు. తన నియోజకవర్గం పాలకుర్తిలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పర్యటిస్తున్న సమయంలో ఆమెకు ఈ ప్రశ్న ఎదురయ్యింది. రూ.4 వేల పెన్షన్ వస్తుందమ్మా అంటూ ఎమ్మెల్యే బదులిచ్చారు. వృద్ధులకు రూ.4 వేల పెన్షన్ ఇస్తామని హామీ ఇవ్వడం తెలిసిందే.