తెలంగాణలోని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ కారే సరస్వతి పుష్కరాల సందర్భంగా ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు స్వయంగా రంగంలోకి దిగారు. ఇద్దరూ టూవీలర్‌పై ప్రయాణించి ట్రాఫిక్‌ను నియంత్రించారు. భారీగా చేరుకున్న భక్తుల వల్ల ఏర్పడిన ట్రాఫిక్‌ను తొలగించి, కూలిపోయిన టెంట్లను మరమ్మత్తు చేసి, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ఈ చర్యకు ప్రజల నుండి మంచి స్పందన లభించింది.