కోల్డ్రిఫ్ కాఫ్ సిరప్‌ను తెలంగాణ ప్రభుత్వం నిషేధించింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో 12 మంది పిల్లల మరణాలకు ఈ సిరప్ కారణం. కంపెనీ నమూనాల్లో డీఈజీ, ఈజీ అనే ప్రమాదకర విష రసాయనాలను 48% గుర్తించారు. ఇవి కిడ్నీ ఫెయిల్యూర్‌కు దారితీసి, పిల్లల్లో మరణాలకు కారణమవుతాయి. డబ్ల్యూహెచ్ఓ కూడా దీనిపై హెచ్చరికలు జారీ చేసింది.