పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ప్రతిరోజూ ఉదయం ఒక నాగుపాము నంది విగ్రహం వద్ద ప్రదక్షిణలు చేసి, కొంతసేపు విశ్రమిస్తుంది. అనంతరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి వెనుక పుట్టలోకి వెళ్తుంది. ఈ అరుదైన దృశ్యాన్ని చూసిన భక్తులు భక్తిపారవశ్యంతో మునిగిపోతున్నారు.