తెలంగాణ మహిళలకు ప్రభుత్వం శుభవార్త అందించింది. నవంబర్ 19న మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా సిద్దిపేటలో సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ చీరల పంపిణీని ప్రారంభిస్తారు. అదే రోజు, రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఐదు లక్షల జీవిత బీమా కల్పించే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కూడా ప్రారంభమవుతుంది. ఈ పథకానికి దరఖాస్తులు నవంబర్ 20 నుండి 30 వరకు గ్రామాల్లో స్వీకరిస్తారు. మహిళలకు ఉచిత చీరలు, కుటుంబాలకు భద్రత ఈ పథకాల లక్ష్యం.