మెస్సీతో ఫుట్ బాల్ మ్యాచ్ కోసం ముమ్మర సాధనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. ఈ నెల 13న హైదరాబాద్‌కు రానున్న అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ జట్టుతో తలపడేందుకు రేవంత్ సారథ్యంలోని ఆర్ఆర్ టీం సిద్ధమవుతోంది. ఉప్పల్ స్టేడియంలో పాఠశాల విద్యార్థులతో మెస్సీ మ్యాచ్ ఆడనున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక మ్యాచ్ కోసం పగలు రాజకీయాలు, సాయంత్రం ఫుట్‌బాల్ ప్రాక్టీస్‌తో సీఎం బిజీగా ఉన్నారు.