నిర్మల్ జిల్లా కుంటాల మండలం అంబటికంటిలో నివసించే వృద్ధ దంపతులు రాజవ్వ గోవిందులను ముగ్గురు దొంగలు మోసం చేశారు. రెండు తులాల బంగారు గొలుసు దొంగతనం చేశారు. గవర్నమెంట్ అధికారులమని నమ్మించి, దొంగతనాల గురించి హెచ్చరించి, వారి బంగారాన్ని కాగితంలో దాచమని చెప్పి మోసం చేశారు. మోసపోయామని తెలుసుకున్న వృద్ధ దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ప్రారంభమైంది.