పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పట్టణాల పరిశుభ్రతకు కొత్త నియమావళిని తీసుకొచ్చింది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రోడ్లపై ఉమ్మేస్తే రూ.100, చెత్త వేసినా, ప్లాస్టిక్ వాడినా, మూత్ర విసర్జన చేసినా రూ.200 జరిమానా విధిస్తారు. షాపుల ముందు చెత్త వేసినా షాపు యజమానులకు ఫైన్ తప్పదు. మంత్రి అగ్నిమిత్ర పాల్ ఈ కఠిన చర్యల ఆవశ్యకతను నొక్కి చెప్పారు.