చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన రాయలం జయశ్రీ సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 360వ ర్యాంకు సాధించి ఘనత వహించారు. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆమె, మూడో ప్రయత్నంలో ఈ విజయాన్ని అందుకున్నారు. ఆమె విజయం పట్ల పలమనేరు ప్రజలు, పోలీసులు ఘనంగా సన్మానించారు. తల్లిదండ్రులు, అన్న, గురువుల ప్రోత్సాహమే తన విజయానికి కారణమని జయశ్రీ పేర్కొన్నారు.