చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలోని ఐదారు గ్రామాల ప్రజలు వానల కోసం వింత ఆచారాన్ని పాటిస్తున్నారు. పన్నెండేళ్లకోసారి జరిగే ఈ ఆచారంలో గ్రామస్థులు తమ ఇళ్లను ఖాళీ చేసి పొలాల్లో తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకుని, వానదేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ ఆచారం వారి తాత ముత్తాతల కాలం నుండి కొనసాగుతోంది.