మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న చిత్రంలో విక్టరీ వెంకటేష్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. చిరు సూపర్ హిట్ పాటలకు వెంకీ, వెంకీ సూపర్ హిట్ పాటలకు చిరు డ్యాన్స్ చేసేలా అనిల్ రావిపూడి ప్రత్యేక సన్నివేశాన్ని రూపొందిస్తున్నారు. ఈ వార్త ఇద్దరు హీరోల అభిమానులలో భారీ అంచనాలను పెంచుతోంది.