చాక్లెట్ల కోసం దుకాణానికి వెళ్లిన 9 ఏళ్ల చిన్నారిపై అత్యాచార యత్నం కలకలం రేపింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో జరిగిన ఈ ఘటన పిల్లల భద్రతపై ఆందోళన కలిగిస్తోంది. ఇదే తరహాలో ఖమ్మంలోనూ మరో దారుణం చోటుచేసుకుంది. పిల్లలను ఒంటరిగా బయటకు పంపేటప్పుడు తల్లిదండ్రులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఈ ఘటనలు హెచ్చరిస్తున్నాయి.