త్తర్ ప్రదేశ్ బిజ్నోర్ జిల్లాలోని ఓ వివాహ వేడుకలో చికెన్ ఫ్రై వడ్డింపు విషయంలో ఘర్షణ చోటుచేసుకుంది. పెళ్లి కొడుకు తరపు వారు తక్కువ వడ్డిస్తున్నారంటూ గొడవకు దిగగా, పరిస్థితి చేయి దాటింది. ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడటంతో పోలీసులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.