రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఆర్టీసీ బస్సును కంకర లారీ ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదంలో 20 మంది దుర్మరణం చెందారు. మీర్జాగూడ సమీపంలో జరిగిన ఈ ఘటనలో 10 మంది పురుషులు, 9 మంది మహిళలు, ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం సమయంలో బస్సులో 70 మంది ప్రయాణీకులు ఉన్నారు.