తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్ హల్చల్ సృష్టించింది. తిరుపతి రూరల్ పీఎస్ పరిధిలోని రఘునాథ్ రిసార్ట్స్‌లో ఓ ఇంట్లోకి ప్రవేశించి చోరీకి యత్నించిన గ్యాంగ్, యజమాని అప్రమత్తం అవ్వడంతో పరారైంది. ఈ దృశ్యాలు సీసీ కెమెరా ఫుటేజీలో రికార్డయ్యాయి. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.